about - ప్రజలకు చేరువలో ఆదిలాబాద్ జిల్లా ప్రజావాణి
ప్రజలకు చేరువలో ఆదిలాబాద్ జిల్లా ప్రజావాణి
2017 నుంచి కిసాన్ హెల్ప్‌లైన్ ద్వారా దాదాపు 20,000 సమస్యలు ప్రజలు నమోదు చేశారు కిసాన్ మిత్ర కార్యకర్తలు వీటిని ఫాలోఅప్ చేయడంలో కృషి చేశారు. మంచి అధికారులు, కలెక్టర్ల జోక్యంతో కొన్ని సమస్యలు త్వరగా పరిష్కారమయ్యాయి. మరికొన్ని సమస్యలు ఏళ్ల తరబడి అలాగే పెండింగ్‌లోనే మిగిలిపోయాయి.
కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత, సీఎం ప్రజావాణి కార్యక్రమం హైదరాబాదులో ప్రారంభమైంది.
ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్ నోడల్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకొని, ఈ ప్రయత్నాన్ని ముందుకు నడిపించారు. అనేక సమస్యలు ముందుకు కదిలాయి. అయినా కొన్ని లోపాలు ఉండేవి, అందులో ప్రజలు వారంలో రెండు రోజులు మాత్రమే హైదరాబాదుకు వెళ్లి దరఖాస్తు పెట్టుకునే అవకాశం, దరఖాస్తులు తిరిగి జిల్లాలకు పంపడం, ఏ అధికారి బాధ్యత ఏమిటీ అనేది స్పష్టత లేకపోవడం, పరిష్కారానికి కాలపరిమితి లేకపోవడం లాంటివి వీటిలో కొన్ని.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక పైలట్ ప్రోజెక్ట్ గా గ్రామ, మండల స్థాయిలోనే ఫిర్యాదులు స్వీకరించే కొత్త వ్యవస్థ ప్రారంభమైంది.
దీని ప్రకారం మండల స్థాయి అధికారులు 30 రోజుల్లోపు చర్య తీసుకున్న నివేదిక (ATR) ఇవ్వాలి. ప్రతి పౌరుడు తన సమస్యను బహిరంగ వేదికపై వినిపించుకునే అవకాశం పొందాలి. మండల స్థాయిలో పరిష్కారం రాకపోతే, అప్పీల్ ద్వారా జిల్లా లేదా రాష్ట్ర స్థాయికి వెళ్లే మార్గం ఉండాలి. ఈ కొత్త విధానం జనవరి 27, 2025న ప్రారంభమై కొద్ది నెలల్లోనే 16 మండలాల్లో 68 బహిరంగ విచారణలు నిర్వహించారు.
ప్రస్తుత సవాళ్లు
- కేంద్రికృత వ్యవస్థ: ప్రజలు హైదరాబాదు లేదా కలెక్టరేట్‌కు వెళ్లాల్సి రావడం.
- కాలపరిమితి లేకపోవడం: ఫిర్యాదులు ఎప్పటిలోగా పరిష్కరించాలి అనే స్పష్టత లేకపోవడం.
- SOPలు లేకపోవడం: అధికారులకు మార్గదర్శకాలు లేకపోవడం వల్ల సరైన చర్య ఆలస్యం అవుతోంది.
- పౌర భాగస్వామ్యం లేకపోవడం: ఫిర్యాదు చేసిన వారికి వినిపించే అవకాశం లేకపోవడం.
- ఫిర్యాదు స్థితి తెలియకపోవడం: ప్రజలకు తమ ఫిర్యాదు ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోవడం.
ఈ ప్రక్రియలో ప్రజా భాగస్వామ్యం
• 64 మండల స్థాయి విచారణలు 5 నెలల్లో నిర్వహించబడ్డాయి.
• 50–80% మంది ఫిర్యాదుదారులు విచారణలకు హాజరై ప్రత్యక్ష పరిష్కారాలు పొందారు.
• మహిళల అధిక భాగస్వామ్యం: గ్యాస్ సబ్సిడీ (85%), గృహజ్యోతి (56%), పంట రుణ మాఫీ (38%) ఫిర్యాదులు మహిళలవే.
ప్రజావాణి పైలట్ ముఖ్య అంశాలు.......
- బహుళ మార్గాల్లో ఫిర్యాదు నమోదు (ఆన్‌లైన్ + IFCలు).
- సమాచార సహాయ కేంద్రాలు (IFCs) – మండల స్థాయిలో ఏర్పాటు.
- గ్రీవెన్స్ రీడ్రెస్సల్ ఆఫీసర్లు (GROలు) – ప్రతి విభాగంలో గుర్తింపు.
- మండల స్థాయి ప్రజా విచారణలు – తప్పనిసరిగా నిర్వహణ.
- చర్య తీసుకున్న నివేదికలు (ATRs) – 30 రోజుల్లో రాతపూర్వక సమాధానం.
- గుర్తించిన 18 విభాగాలకు SOPలు.
- 6 నెలల్లో 7,788 ఫిర్యాదులు నమోదు కాగా, 5,509 (71%) ATR లు దాఖలు అయ్యాయి.
ప్రాథమిక ఫలితాలు
- త్వరిత పరిష్కారం: విచారణల్లో 42 % సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించబడ్డాయి.
- వ్యవస్థాపక లోపాలు బయటపడటం: పెన్షన్, రేషన్ కార్డు, NFBS వంటి సమస్యలు గుర్తించబడ్డాయి.
- అధికారుల బాధ్యత పెరగడం: మండల స్థాయి GROల నియామకం వల్ల సమాధానదాయకత పెరిగింది.
- విభాగాల మధ్య సమన్వయం: ప్రజా విచారణలు విభాగాల మధ్య చర్చకు వేదిక అయ్యాయి.
- పెన్షన్ల వ్యవస్థపరమైన జోక్యం
- అడిలాబాద్ పైలట్‌లో గ్రామ స్థాయి మోబిలైజేషన్ సమయంలో తప్పుగా నిలిపివేసిన పెన్షన్ కేసులు గుర్తించబడ్డాయి.
- SERP అందించిన డేటా ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన జరిగింది.
- “శాశ్వత వలస” అని పొరపాటున గుర్తించి 2 లక్షల మందికి పైగా పెన్షన్లు నిలిపివేయబడ్డాయి.
- ఫీల్డ్ వెరిఫికేషన్‌లో 1.2 లక్షల కేసులు పరిశీలించగా, అందులో 1,050 మందికి పెన్షన్ తప్పుగా నిలిపివేసినట్లు నిర్ధారించబడింది. వెంటనే తిరిగి అమలు చేశారు.
- అడిలాబాద్ జిల్లాలోనే 48 మంది లబ్ధిదారులు తిరిగి పెన్షన్ పొందగలిగారు.
- ఈ అనుభవం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు, NFBS, IFR వంటి పథకాలలో కూడా ఇలాంటి డ్రైవ్‌లు చేపట్టబడ్డాయి.
ముఖ్యమైన నేర్చుకున్న పాఠాలు
• గ్రామ స్థాయిలో ఫిర్యాదుల నమోదు అవసరం.
• సమాచారం అందుబాటులో ఉండడం కీలకం – లేకపోతే ప్రజలు సరైన ఫిర్యాదులు పెట్టలేరు.
• ప్రజా విచారణలో సమస్యలు త్వరగా పరిష్కారమయ్యాయి, దరఖాస్తుదారులు సంతృప్తి చెందారు.
• SOPలు – అధికారుల పనితీరు మెరుగుపరిచాయి.
ముందడుగు
• గ్రామ స్థాయిలో ఫిర్యాదుల నమోదు విస్తరణ.
• పారదర్శకత కోసం ప్రజా సమాచార పోర్టల్.
• పౌరులు తమ ఫిర్యాదు స్థితి తెలుసుకోడానికి ఆన్‌లైన్ ట్రాకింగ్ సిస్టమ్.
• కాల్ సెంటర్ ద్వారా ఫీడ్ బ్యాక్ సేకరణ.
• ప్రజావాణి లో వేగవంతమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.)
• చట్టపరమైన బలమైన ఫ్రేమ్‌వర్క్ – అధికారుల బాధ్యతను నిర్ధారించడానికి.
ముగింపు
ఆదిలాబాద్ ప్రజావాణి పైలట్ పద్ధతి ద్వారా గ్రామ స్థాయిలో పౌర సమస్యలు వేగంగా, పారదర్శకంగా పరిష్కరించబడ్డాయి. ముఖ్యంగా పెన్షన్ల వ్యవస్థలో జరిగిన లోపాలను గుర్తించి రాష్ట్రవ్యాప్త మార్పు తీసుకురావడంలో ఈ పైలట్ కీలక పాత్ర పోషించింది. ప్రజా విచారణల ద్వారా విశ్వాసం పెరిగి, మహిళలు, గ్రామీణ ప్రజలు, సామాన్య పౌరులు నేరుగా పాలనలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించింది.
Tanneru. Sri Harsha
9966089839, State Coordinator
No comments yet. Login to start a new discussion Start a new discussion